మార్ష్ మెరుపులు.. లక్నో భారీ స్కోరు

మార్ష్ మెరుపులు.. లక్నో భారీ స్కోరు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ మిచెల్ మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగారు. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్‌ను ఎంచుకోగా, లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 220/5 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
మిచెల్ మార్ష్ 57 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీకి చేరువలో అవుట్ అయ్యారు. బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ 29 బంతుల్లోనే 60 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించడంలో కీలక పాత్ర పోషించారు. రాజస్థాన్ బౌలింగ్: రాజస్థాన్ బౌలర్లలో యశ్ పుంజా 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ తీశారు.
