ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జియాంట్స్ టీమ్స్ మధ్య ఏప్రిల్ 6వ తేదీన మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అదే రోజు శ్రీ రామ నవమి కావడంతో కోల్‌కతాలో భారీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో సెక్యూరిటీ ఇష్యూస్ తప్పవని, ఫుల్ ప్రొటెక్షన్ కల్పించలేమని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు కోల్‌కతా పోలీసులు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో షెడ్యూల్‌లో చేంజెస్ చేసింది బీసీసీఐ. ఏప్రిల్ 8వ తేదీన అదే ఈడెన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్ 6న డబుల్ హెడర్ స్థానంలో కేవలం సన్‌రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో పైఒక్క మ్యాచ్‌లో తప్పితే ఇతర మార్పులేవీ లేవు. మిగతా మ్యాచులన్నీ యథావిధిగానే షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి