Record | వరుణ్ చక్రవర్తి సరికొత్త రికార్డ్..
- ఇంగ్లండ్ సిరీస్‌లో 14 వికెట్లు తీసిన వరుణ్
- ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు
ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ ద్వారా టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. ఈ ఐదు మ్యాచుల సిరీస్‌లో 14 వికెట్లు తీసిన అతడు.. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డుకెక్కాడు. 33 ఏళ్ల భారత స్పిన్నర్ ఈ సిరీస్ చివరి గేమ్‌లో 25 పరుగులిచ్చి, 2 వికెట్లు తీశాడు. తద్వారా ఐదు మ్యాచుల సిరీస్‌లో 14 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.
2021లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధీ 13 వికెట్లు తీయగా, వరుణ్ ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా ఓ టీ20 సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆటగాడు జాసన్ హోల్డర్ 15 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 2022లో ఇంగ్లండ్‌పై ఈ ఘనత సాధించాడు.
ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
- జాసన్ హోల్డర్ (వెస్టిండీస్)- 15
- సమీ సోహైల్ (మలావి)- 14
- వరుణ్ చక్రవర్తి (భారత్)- 14
- ఇష్ సోధి (న్యూజిలాండ్)- 13
- చార్లెస్ హింజ్ (జపాన్)-13