వారికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుక…

వారికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుక…

  • చర్లపల్లి జైలు నుంచి 91 మంది జీవిత ఖైదీల విడుదల!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. జైల్లో సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం గుద్ న్యూస్ చెప్పింది. సత్ప్రవర్తన కనబరిచిన 91 మంది జీవిత ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష ప్రసాదిస్తూ.. ముందస్తుగా విడుదల చేసింది. ఈ మేరకు ఖైదీల విడుదలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులైన జీవో ఎంఎస్ నెం.54 (GO MS No.54)ను జారీ చేసింది.

దీంతో, ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం చర్లపల్లి కేంద్ర కారాగారం (Charlapally Central Prison) నుంచి అధికారులు 91 మంది ఖైదీలను విడుదల చేశారు. విడుదలైన వారిలో 85 మంది పురుషులు కాగా, ఆరుగురు మహిళా ఖైదీలు ఉన్నారు