Incident | ఇరు కుటుంబాల్లో విషాదం…

Incident | ఇరు కుటుంబాల్లో విషాదం…

Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమజంట వేర్వేరు చోట్ల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మనస్పర్థల కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

చెన్నూరుకు చెందిన హేమశ్రీ, యోగేంద్ర కుమార్ వర్మ మధ్య ఇటీవల విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో యోగేంద్ర వర్మ కడపలోని తన బంధువుల ఇంటి వద్ద ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అదే సమయంలో హేమశ్రీ చెన్నూరులోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒకేసారి ఇద్దరూ ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply