మంచినీటి స‌ర‌ఫ‌రా లేక అవ‌స్థ‌లు..

మంచినీటి స‌ర‌ఫ‌రా లేక అవ‌స్థ‌లు..

శివ్వంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో మంచినీటి సమస్య పరిష్కారానికి మరింత కృషి చేస్తామని మండల కాంగ్రెస్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్త(Pulimamidi Naveen Gupta) అన్నారు. మంచినీటి సరఫరా లేకపోవడం, పైపు లైన్ లేక ఇబ్బందిగా ఉన్న విషయం పార్టీ వర్గాల ద్వారా తెలుసుకున్ననవీన్ గుప్త ఈ రోజు తన స్వంతంగా శివ్వంపేట(Shivampet) బురుద బాటలోని బోరులో మోటారు, స్టాటారు, కేబుల్ వైర్, పైపు లైన్ ఏర్పాటు చేయించి, నీటి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.

ఎస్సీ కాలనీలో సింగల్ పేజ్(Single page) మోటారు కాలిపోవడంతో అక్కడ కూడ కొత్త మోటారును తెప్పించి నీటి సమస్యను పరిష్కరించారు. ఈసందర్బంగా నవీన్ గుప్త మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వారాల గణేష్, బిస్కుంద అంజయ్య, ఎండీ దావుద్, కములయ్యగారి వెంకటేష్, బిజిలిపురం సత్తయ్య, దేవనబోయిన కృష్ణ, ఇసారపు రాజుగౌడ్, ఇసుగారి అరుణ్, కార్తీక్ యాదవ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply