చొప్పదండి, ఆంధ్రప్రభ : సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చొప్పదండి సిఐ ప్రదీప్ కుమార్ తెలియజేశారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ… చొప్పదండి సర్కిల్ పరిధిలోని ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 24గంటల పాటు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని, అదేవిధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలు పనిచేస్తాయని, విజిబుల్ పోలీసింగ్ ఉంటుందన్నారు. బాధ్యతలు స్వీకరించిన సిఐ ప్రదీప్ కుమార్ కు ఎస్సైలు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.