తెలంగాణ ప్రభుత్వానికి బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందింది. తెలంగాణలో కులగణన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిషన్ చీఫ్ బూసాని వెంకటేశ్వర్లు… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి 700 పేజీల నివేదికను అందజేశారు.
అసెంబ్లీ సెగ్మంట్లు వారిగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని కమిషన్ సూచించినట్లు తెలుస్తోంది. మొత్తం ఆరు సెగ్మంట్లు రూపంలో డెడికేషన్ కమిషన్ ఇచ్చినట్లు సమాచారం. డెడికేటెడ్ కమిషన్ దాదాపు మూడు నెలలు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
కాగా, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ వార్డు నుంచి జడ్పీ చైర్మన్ దాకా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ రిజర్వేషన్లను ఖరారు చేయనుంది.