చెన్నూరులో ఆదివాసీల భారీ ర్యాలీ..
చెన్నూర్, ఆంధ్రప్రభ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ముగింపు వేడుకలు గురువారం చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ గిరిజన ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా పట్టణంలోని ప్రధాన వీధులలో భారీర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు గిరిజన ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నాయని గిరిజన ఆదివాసీ సంఘం నాయకులు ఆరోపించారు.
