అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎస్సీ వర్గాల అభ్యున్నతికి క్రిషి చేస్తా..

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎస్సీ వర్గాల అభ్యున్నతికి క్రిషి చేస్తా..
అంబేద్కర్ జయంతి సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి…
భవానిపురం, ఆంధ్రప్రభ : బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే అందరికీ అనుసరణీయమని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఎస్సీ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భవానీపురం 42వ డివిజన్ హౌసింగ్ బొర్డు కాలనీలో అంబేద్కర్ 135 వ జయంతి నిర్వహించారు. కార్యకమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే సుజనా చౌదరి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సామాజికి సమానత్వాన్ని చాటుతూ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. ఈ రోజు చాలా దేశాలు ఆయన రాజ్యంగాన్ని స్పూర్తిగా తీసుకోవడం గర్వకారణమన్నారు. అన్నికులాలు, మతాల సమ్మిళితమైన పశ్చిమ నియోజకవర్గాన్ని మినీ భారత్ గా పిలుస్తారని, అటువంటి ప్రాంతంలో పోటీ చేసిన నన్ను అన్ని వర్గాల వారు ఆదరించడం అభినందనీయమన్నారు. ఎస్సీ వర్గాలకు చెందిన ఎటువంటి సమస్య ఐనా తన ద్రుష్టికి వస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నిర్వహిస్తున్న సంఘ నాయకులను సుజనా చౌదరి అభినందించారు. కార్యక్రమంలో ఎస్సీ కులాల సంక్షేమ సంఘం అద్యక్షుడు రామారావు, భాస్కరరావు, బుజ్జ, డివిజన్ టీడీపీ అద్యక్షుడు ఏదుపాటి రామయ్య, మాజీ కార్పొరేటర్లు, బుల్లా విజయ్ కుమార్, అబ్దుల్ ఖాదర్, పత్తి నాగేశ్వరరావు, జనసేన అద్యక్షురాలు తిరుపతి అనూష, తదితరులు పాల్గొన్నారు.
