అమూల్యమైన సేవలకు ఆపన్నహస్తం…

అమూల్యమైన సేవలకు ఆపన్నహస్తం…
మరణించిన హోంగార్డుల కుటుంబాలకు అండగా నిలిచిన పల్నాడు జిల్లా హోంగార్డులు
జిల్లా హోంగార్డులను అభినందించిన అదనపు ఎస్పీ సంతోష్
నరసరావుపేట, ఆంధ్రప్రభ : తోటి సహోద్యోగుల కుటుంబాలకు సహాయం చేయడానికి, మరణించిన హోంగార్డు కుటుంబాలకు ఒక్కరోజు వేతనం అందించిన పల్నాడు జిల్లా హోంగార్డులను జిల్లా అదనపు ఎస్పీ జెవి సంతోష్ అభినందించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం బాధిత కుటుంబాలకు జిల్లా అదనపు ఎస్పీ సంతోష్ చెక్కులను అందజేశారు. రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ గతేడాది అక్టోబర్ 25న బి విజయ్ కుమార్ (హెచ్ జి -82) అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.
వి విజయ్ శోభన్ (హెచ్ జి – 204) పల్నాడు జిల్లా నుండి గుంటూరు జిల్లా కు అటాచ్మెంట్ మీద వెళ్ళి విధులు నిర్వర్తిస్తూ గతేడాది అక్టోబర్ 28 న అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. వారివురి కుటుంబాలకు పల్నాడు జిల్లాలోని హోంగార్డు లు అందరూ వారి ఒక రోజు వేతనం మొత్తం రూ. 5,00,000/- ల చొప్పున సత్తెనపల్లి టౌన్ పోలీసు స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్ కుమార్ భార్య అయిన జ్యోతికి, ప్రస్తుతం ఉద్యోగం కొరకు నల్గొండ జిల్లా లో ఎస్ బి ఎంక్వయిరీ జరుగుచున్న విజయ్ శోభన్ భార్య అయిన శ్రీలేఖలకు జిల్లా అదనపు ఎస్పీ సంతోష్ చేతుల మీదుగా చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ సంతోష్ మాట్లాడుతూ సాటి హోంగార్డ్ లకు సహాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పల్నాడు జిల్లా హోం గార్డులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు ఆర్ఐ ఎస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
