Special Trains | తిరుప‌తి, హిస్సార్, తిరువ‌ణ్నామ‌లై రూట్ లో ప్ర‌త్యేక రైళ్లు…

సికింద్రాబాద్ – ప్రయాణికుల రద్దీని (Passengers rush ) దృష్టిలో ఉంచుకుని య పలు ముఖ్యమైన మార్గాల్లో మొత్తం 48 ప్రత్యేక రైళ్లను (48 special trains ) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (south central railway ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 9 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది

ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు

తిరుపతి-హిసార్ మధ్య 12 సర్వీసులను నడపనున్నారు. ఈ రైళ్లు ప్రతి బుధ, ఆదివారాల్లో అందుబాటులో ఉంటాయి. అదే విధంగా, కాచిగూడ-తిరుపతి మధ్య 8 రైళ్లు ప్రతి గురు, శుక్రవారాల్లో రాకపోకలు సాగిస్తాయి. ఇక నరసాపూర్-తిరువణ్ణామలై మార్గంలో అత్యధికంగా 16 ప్రత్యేక రైళ్లను బుధ, గురువారాల్లో నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైళ్ల రాకపోకల సమయాలు, ఇతర పూర్తి వివరాల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

Leave a Reply