హైకోర్టు తీర్పుతో మళ్ళీ పాత సొసైటీ పాలకవర్గాల కొలువు

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ హైకోర్టు వెలువరించిన కీలక తీర్పుతో మళ్లీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో పాత పాలకవర్గాల సందడి మొదలైంది. గతంలో ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టివేయడంతో, పాత కమిటీల పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో భీమ్‌గల్ మండల కేంద్రంలోని ముచ్కూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షుడిగా బాంగ్లా దేవేందర్, ఇంచార్జ్ సొసైటీ డైరెక్టర్ మెంబర్లుగా వడ్యాల లక్ష్మణ్, ఇందాపు శ్రీనివాస్,బురెడ్డి రాజన్న, బురెడ్డి గంగారెడ్డి బొమ్మెన సాయన్న, తెడ్డు లావణ్య, కైరి లక్ష్మి, గడ్డం బాలయ్య, మలవత్ వెంకటేష్, బంగ్లా లక్ష్మీ నర్సగౌడ్,పాలకవర్గ సభ్యులు గురువారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో నూతనంగా సొసైటీ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టిన చైర్మన్,డైరెక్టర్ కార్యదర్శి క్రాంతి, మరియు గ్రామస్తులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply