పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మచ్ అవౌటెడ్ మూవీ “హరిహర వీరమల్లు”. నిజ జీవిత యోధుడు వీరమల్లు జీవిత కథ ఆధారంగా క్రిష్ జాగర్లముడి, జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో, మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్లను ఘనంగా ప్రారంభించారు.
తాజాగా నేడు సినిమా మూడో సాంగ్ ‘‘అసుర హననం’’ని విడుదల చేశారు మేకర్స్. కీరవాణి ఇచ్చిన ట్యూన్ సహా రాంబాబు గోసల సాహిత్యం స్టన్నింగ్ గా ఉన్నాయి.
ఇక ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మాణం వహించగా ఈ జూన్ 13న పాన్ ఇండియా భాషల్లో సినిమా విడుదల కాబోతుంది.