కృష్ణ శతకం

40. చక్రధారి వీవు చక్రవర్తివి నీవు
ధరణిజనులు నీకు దాసులేను
దర్శకుండవుగ ప్రదర్శకులము మేము
గీతదాత నీకు కేలుమోడ్తు

41. తల్లితోడ గూడ కల్లలాడిన వాడ
నల్లనయ్య తేటతెల్లమయ్యె
మన్నునయిననేమి? మిన్నునయిననేమి?
గీతదాత నీకు కేలుమోడ్తు

42. మాయలైననేమి? మంత్రమయిననేమి?
మనసుజూచునట్టి మనసు నీది
ఎదుటివారి కుట్రలెప్పుడు భగ్నమే
గీతదాత నీకు కేలుమోడ్తు

Leave a Reply