పచ్చదనం పెంపొందించడానికి కృషి చేయాలి
మొక్కలు నాటిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సీతారాం
భీమవరం, ఆంధ్రప్రభ: పచ్చదనం పెంపొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారాం సూచించారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భీమవరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో అంకెం సీతారాం శుక్రవారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా కార్యాలయం శుభ్రం చేయడంతో పాటు జాతీయ దినోత్సవ ఏర్పాట్లకు అందంగా ముస్తాబు చేశామన్నారు.
ఈ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి దూలం సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బల్ల నాయుడు, యూత్ నాయకులు కొల్లి పట్టాభి రామయ్య, అంకెం జయదీప్, పుచ్చకాయల రత్నరాజు, బంటుమిల్లి పండు, అంతపురం నాని తదితరులు
