సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు.

బీజేపీ మండల అధ్యక్షుడు సుర్వి రాజుగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ మండల కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి ప్రారంభమై అంబేద్కర్ విగ్రహం మీదుగా చౌరస్తా వరకు కొనసాగింది. నాయకులు, కార్యకర్తలు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని దేశభక్తి నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనూరు వీరారెడ్డి మాట్లాడుతూ.. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ కోట్లాది మంది భారతీయులను ఒకే భావనతో, ఒకే జాతీయ స్ఫూర్తితో కలిపి ఉంచేది త్రివర్ణ పతాకమేనని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజు ముదిరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు వంగరి రఘు, చిలువేరు వెంకటేష్, కోడూరు బీరయ్య, గొల్లూరు యాదగిరి, సాగర్, జక్కర్తి నరసింహ, సంగిశెట్టి లక్ష్మీనారాయణ, బద్దం యాదయ్య గౌడ్, నెల్లికంటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.