Handouts | సంబరాలకు వేళాయే..!

Handouts | సంబరాలకు వేళాయే..!
- 14 నుంచి ఘంటసాలలో సంక్రాంతి సంబరాలు
- రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభ రాజములు బండ లాగుడు ప్రదర్శన
- జలధీశ్వరుని ఆలయంలో కరప్రతాలు విడుదల చేసిన ప్రతినిధులు
Handouts | ఆంధ్రప్రభ, కృష్ణా బ్యూరో : ఘంటసాల గ్రామంలో మన ఊరు – మన సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సిద్ధం కానుంది. ప్రతీ ఏడాది మాదిరిగానే 2026 జనవరి 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బండలాడుగు ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఇందుకు సంబంధించి శుక్రవారం కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలోని శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వరస్వామివారి ఆలయంలో కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14వ తేదీన ఆరుపళ్ళ విభాగం, 15వ తేదీన న్యూ కేటగిరి విభాగం, 16వ తేదీ రెండు పళ్ళ విభాగాలలో ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు. 14వ తేదీ ఉదయం 9 గంటలకు ఒంగోలు జాతి ఆవుల అందాల పోటీలు నిర్వహించబడునని తెలిపారు.
14వ తేదీన జరిగే ఆరుపళ్లు విభాగంలో మొదటి బహుమతి గెలుపొందిన వారికి రూ.50 వేలు, రెండవ బహుమతి రూ.40 వేలు, మూడవ బహుమతి రూ.30 వేలు, నాల్గవ బహుమతి 20 వేలు, ఐదవ బహుమతి రూ.15 వేలు, ఆరవ బహుమతి 10 వేలు అందించటం జరుగుతుందని తెలిపారు. 15వ తేదీ న్యూ కేటగిరిలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.60 వేలు, రెండవ బహుమతి రూ.50 వేలు, 3వ బహుమతి రూ.40 వేలు, నాల్గవ బహుమతి రూ.30 వేలు, ఐదవ బహుమతి రూ.20 వేలు, ఆరవ బహుమతి రూ.15 వేలు, ఏడవ బహుమతి రూ.10 వేలు ఇవ్వనున్నారు.
16వ తేదీ రెండు పళ్ళు విభాగం ప్రదర్శనలో మొదటి బహుమతి రూ.25 వేలు, రెండవ బహుమతి రూ.20 వేలు, మూడవ బహుమతి రూ.15 వేలు, నాల్గవ బహుమతి రూ.10 వేలు, ఐదవ బహుమతి రూ.8 వేలు, ఆరవ బహుమతి రూ.5 వేలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రదర్శన పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని పశుపోషకులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బండి పరాత్పరరావు, గొర్రెపాటి వెంకట రామకృష్ణ, అయినపూడి భాను ప్రకాష్, వేమూరి రాజేంద్ర ప్రసాద్, గొర్రెపాటి జనార్ధనరావు, గొర్రెపాటి నరసిం హారావు, గొర్రెపాటి సురేష్, కాకుమాని రంగారావు, వేమూరి రమేష్, గొర్రెపాటి శ్రీనివాస్, గొర్రెపాటి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
