గ్రామపంచాయతీల అభివృద్ధిపై 28న మండలస్థాయి ప్రత్యేక సమావేశం

సర్పంచులు, అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి: ఎంపీడీఓ

జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీల సామర్థ్యాన్ని పెంపొందించడం, గ్రామపంచాయతీల అభివృద్ధిపై చర్చించేందుకు ఈ నెల 28న మంగళవారం జుక్కల్ మండల కేంద్రంలో మండలస్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ బి. శ్రీనివాస్ తెలిపారు.

జుక్కల్ ఎంపీపీ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జడ్పీ సీఈఓ, జుక్కల్ మండల ప్రత్యేక అధికారి చందర్ నాయక్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు.

మండలంలోని అన్ని శాఖల అధికారులు, అన్ని గ్రామపంచాయతీల కార్యదర్శులు, అన్ని గ్రామాల సర్పంచులు ఈ ప్రత్యేక సమావేశానికి తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని ఎంపీడీఓ బి. శ్రీనివాస్ కోరారు.