14న ఘనంగా సంతోషిమాత ఆలయంలో కుంకుమార్చన..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివరాంనగర్‌లో వెలసిన శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రావణమాస తొలి శుక్రవారం సందర్భంగా లలిత సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు మోనిగారి పండరినాథ్‌–సరోజ, మోనిగారి రమేష్‌–లావణ్య తెలిపారు.

ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వారు వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు లలిత సహస్రనామ కుంకుమార్చన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు.