MD | జగన్మాత సేవలో ఆంధ్రప్రభ ఎండి..

MD | జగన్మాత సేవలో ఆంధ్రప్రభ ఎండి..

  • కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు..
  • గౌతమ్ దంపతులకు దుర్గ గుడి చైర్మన్, ఈవో మర్యాద పూర్వక స్వాగతం..

MD | విజయవాడ, ఆంధ్రప్రభ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి దేవస్థానంలో కొలువైయున్న జగన్మాత సేవలో ఆంధ్రప్రభ ఎండి ముత్తా గౌతమ్(Andhraprabha MD Muttha Gautam) కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

అమ్మవారి దర్శనానికి ఆలయానికి విచ్చేసిన ఆయనకు దుర్గగుడి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ (గాంధీ) సాదర స్వాగతం పలికారు. అమ్మవారికి మూత్తా గౌతమ్ దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేద ఆశీర్వచనం మండపంలో వేద పండితులు మూత్తా గౌతమ్ దంపతులకు వేద ఆశీర్వచనం చేయగా దుర్గగుడి ఈవో శీనా నాయక్(Sheena Nayak), చైర్మన్ బొర్రా గాంధీలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

అనంతరం చైర్మన్ తన చాంబర్‌లో భవాని దీక్షల విరమణ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లు, ఆలయ విశేషాలు, అభివృద్ధి పనులను ఆంధ్రప్రభ ఎండి గౌతమ్‌కి వివరించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఆలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Leave a Reply