Govt Hospital | పొలం ప‌నుల‌కు వెళ్లి…

Govt Hospital | పొలం ప‌నుల‌కు వెళ్లి…

Karimnagar | కాల్వ శ్రీరాంపూర్, ఆంధ్ర‌ప్ర‌భ : వ్యవసాయ పనులకు వెళ్లి పాముకాటుతో మహిళా మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సూదాటి రమాదేవి(Soodati Ramadevi వ్యవసాయ పనులకు వెళ్లి పొలంలో పనిచేస్తుండగా పాముకాటుకు గురయింది.

గమనించిన తోటి కూలీలు హుటాహుటిన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి(Government Hospital)కి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు కూలీలు తెలిపారు. మృతురాలి భర్త సూదాటి సత్యనారాయణ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply