విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు..

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు..
ప్రజల నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి..
సచివాలయం సిబ్బందిని హెచ్చరిచ్చిన ఎమ్మెల్యే యార్లగడ్డ
రామవరప్పాడు, ప్రసాదంపాడు సచివాలయాల్లో అకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్య యార్లగడ్డ
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సచివాలయం సిబ్బందికి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను యుద్ధ ప్రతిపాదించిన పరిష్కరించాలని సూచించారు. మండల పరిధిలోని రామవరప్పాడు, ప్రసాదంపాడు గ్రామాలలోని సచివాలయాలను శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. సచివాలయం సిబ్బంది రిజిస్టర్లను, గ్రీవెన్స్ లో వస్తున్న ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారో సచివాలయం సిబ్బంది అడిగి తెలుసుకున్నారు.
సచివాలయంలో విధులకు ఎంతమంది సిబ్బంది వచ్చారు ఎంతమంది ఫిర్యాదుల పరిష్కారానికి వెళ్లారు అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని సచివాలయాల్లో రికార్డులు లేకపోవడం పై ఎమ్మెల్యే యార్లగడ్డ అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయాల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని సూచించారు. గ్రీవెన్స్ లో రోజుకి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి ఎన్ని ఫిర్యాదులు పరిష్కరించారు పూర్తి వివరాల రికార్డులను పరిశీలించారు.
ఒక్కొక్క సచివాలయంలో ఎంత మంది సిబ్బంది ఉన్నారు ఎంతమంది విధులకు హాజరయ్యారు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని ఒకవేళ సచివాలయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే ఉన్నత అధికారులతో చర్చించి ఆ యొక్క సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఇకనుంచి నియోజకవర్గంలోనీ సచివాలయం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని ఎవరైనా సిబ్బంది బాధ్యతారహితంగా ఉంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
రామవరప్పాడు, ప్రసాదంపాడు గ్రామలలోని సచివాలయాలకు ఎవరికి చెప్పకుండా ఎమ్మెల్యే ఎర్రగడ్డ తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. పార్టీ నాయకులను ఎందుకు వచ్చారు మీకు ఈ విషయం సంబంధం లేదు నాతో పాటు రాకండి అని హెచ్చరించి తన స్వయంగా ఏ సచివాలయానికి వెళ్తున్నాను ఎవరికీ చెప్పకుండా సచివాలయాలకు వెళ్లి అధికారులను పిలిపించి మాట్లాడారు.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఏ రోజు ఏ గ్రామ సచివాలయను ఆకస్మికంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. మరోసారి పరిష్కారం వచ్చినప్పుడు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.
