కేడీసీసీ బ్యాంక్‌కు ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్…

కేడీసీసీ బ్యాంక్‌కు ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్…

నాణ్యతలో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన సహకార బ్యాంక్..
డిజిటల్ సేవలు, పారదర్శకతకు ప్రపంచ స్థాయి ముద్ర..
రైతు సేవల మెరుగుదలకు దోహదం
కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అయిన కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు సేవల నాణ్యతలో మరో మైలురాయిని అధిగమించింది. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజషన్ ఫర్ స్టాండర్దిజషన్ ఐఎస్ఓ నుంచి ఐ ఎస్ ఓ 9001:2015 సర్టిఫికేషన్‌ను పొందింది. ఈ సర్టిఫికేషన్‌ను బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురామ్ స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్ అనేది కేవలం గుర్తింపు మాత్రమే కాకుండా, బ్యాంక్‌లో అమలు చేస్తున్న వ్యవస్థలు, పారదర్శకత, సేవల ప్రమాణాలు, వినియోగదారుల సంతృప్తికి ప్రపంచ స్థాయి ధృవీకరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్ సాధించడం కే డి సి సి బ్యాంక్‌కు గర్వకారణం అని ఇది మా సేవల నాణ్యతకు అంతర్జాతీయ గుర్తింపు. రైతులు, ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందించాలనే మా నిబద్ధతకు ఇది ప్రతిఫలం అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో సహకార రంగాన్ని ఆధునీకరించడంలో కేడీసీసీ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తున్నదని వివరించారు. జిల్లాలోని అన్ని పి ఎ సి ఎస్ లను డిజిటల్ వ్యవస్థలతో అనుసంధానం చేసి, యూపీఐ ఫోన్ పే వంటి ఆధునిక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వన్ టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా వడ్డీ మాఫీ వంటి పథకాలను అమలు చేసి వేలాది మంది రైతులకు ఉపశమనం కల్పించామని పేర్కొన్నారు. ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్ సాధించడం ద్వారా కేడీసీసీ బ్యాంక్ రాష్ట్రంలోనే కాకుండా దేశ స్థాయిలోనూ సహకార బ్యాంకింగ్ రంగానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో మొట్టమొదటిగా ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందడం విశేషమని, భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలతో సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని చైర్మన్ నిత్యం శ్రీ రఘురాం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ శ్యామనోహర్ ఐ ఎస్ ఓ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply