Delhi | ఏపీకి గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

  • విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్..
  • కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర మంత్రివర్గం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర కేబినెట్ రైల్వే విస్తరణ, పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుందని.. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని మరింత విస్తరించి.. కొత్త విధానాలను ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 8,800 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ నిర్ణయం ద్వారా లక్షలాది మంది యువతకు నైపుణ్యాలను మెరుగుపరిచే అవకాశాలు లభించనున్నాయి.

ఇస్రోలో మూడో ప్రయోగ వేదిక ఏర్పాటుకు కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,985 కోట్లతో మూడో లాంచ్‌ ప్యాడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రోదసిలోకి మానవుడిని పంపే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలో వేతన సంఘం చైర్మన్‌ను నియమిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. నేషనల్ సఫారీ కర్మచారి కమిషన్ పదవీకాలం మార్చి 31, 2028 వరకు పొడిగించారు.

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కోసం 6,000 కోట్లు, జన్ శిక్షన్ సంస్థాన్ కోసం 858 కోట్లు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి అష్వినీ వైష్ణవ్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *