Jammu and Kashmir | ఏడుగురు పాక్ చొరబాటుదారులు హతం

జమ్మూ కాశ్మీర్‌లో శుక్రవారం ఏడుగురు పాకిస్థాన్ చొరబాటుదారులు హతమయ్యారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి ప్రాంతంలో చోటుచేసుకుంది.

పాక్ చొరబాటుదారులు నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు ఏడుగురు చొరబాటుదారులను హతమార్చాయి. వీరిలో ఇద్దరు పాకిస్థాన్ ఆర్మీకి చెందిన వారని తెలుస్తోంది.

Leave a Reply