కాళేశ్వరం మల్టీ జోన్-1లో ఎస్ఐల బదిలీలు
కాళేశ్వరం మల్టీ జోన్-1లో ఎస్ఐల బదిలీలు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ: కాళేశ్వరం మల్టీ జోన్-1 పరిధిలో పనిచేస్తున్న పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్హెచ్వోలుగా పనిచేస్తున్న అధికారులతో పాటు, సీఎస్బీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పలువురికి స్థానచలనం కల్పించారు.
కన్నేపల్లి ఎస్‌హెచ్‌వోగా పనిచేస్తున్న కె. భాస్కర్ రావును సీఎస్బీ రామగుండంకు, మంథని ఎస్‌హెచ్‌వో డాగల రమేశ్‌ను సీఎస్బీ రామగుండంకు, పెద్దపల్లి ఎస్‌హెచ్‌వో లక్ష్మణరావును సీఎస్బీ రామగుండంకు బదిలీ చేశారు. అలాగే పొత్కపల్లి ఎస్‌హెచ్‌వో దీకొండ రమేశ్‌ను సీఎస్బీ రామగుండంకు, బెల్లంపల్లి ఎస్‌హెచ్‌వో సీహెచ్. కిరణ్ కుమార్‌ను సీఎస్బీ రామగుండంకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎస్బీ రామగుండంలో పనిచేస్తున్న కె. రాణి, ఎ. రాజమణి, బి. శరణ్య, ఎ. హైమా, కె. మౌనికలను రామగుండం వీఆర్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా కౌటాల ఎస్‌హెచ్‌వో డి. చంద్రశేఖర్‌ను డీఎస్బీ కొమురం భీం ఆసిఫాబాద్‌కు, ఈస్గాం ఎస్‌హెచ్‌వో ఇస్లావత్ సురేశ్‌ను డీసీఆర్బీ కొమురం భీం ఆసిఫాబాద్‌కు బదిలీ చేశారు. కాళేశ్వరం ఎస్‌హెచ్‌వో జి. తమాషా రెడ్డిని డీఎస్బీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు, ములుగు ఎస్‌హెచ్‌వో ఉపేందర్ రావును ములుగు జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
