దత్త క్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం..
- 25 మంది భక్తులకు వైద్య పరీక్షలు.. మందుల పంపిణీ
భీమారం, ఆంధ్రప్రభ : శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త జ్ఞానబోధ ట్రస్ట్ ఆధ్వర్యంలో ములుగు రోడ్డు ప్రాంతంలోని దత్తక్షేత్రంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కంటేం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో స్వామివారి దర్శనానికి వచ్చిన సుమారు 25 మంది భక్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ రవి, డ్రైవర్ సారంగం, క్షేత్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
