Forehead Pain | ఏ ప్రాంతంలో నొప్పి వస్తే ఏది కారణం?

Forehead Pain | ఏ ప్రాంతంలో నొప్పి వస్తే ఏది కారణం?
Forehead Pain | నుదుటి నొప్పి ఎందుకు వస్తుంది?
కణతల నొప్పికి ప్రధాన కారణాలు
కళ్ల వెనుక నొప్పి ప్రమాదకరమా?
సైనస్ ప్రాంతంలో నొప్పి వస్తే ఏమి చేయాలి?
ఒకవైపు తలనొప్పి అంటే మైగ్రేనా?
తల పైభాగం నొప్పికి కారణాలేమిటి?
దవడ నొప్పి తలనొప్పికి ఎలా దారితీస్తుంది?
తల వెనుక భాగంలో నొప్పి ఎందుకు వస్తుంది?
మెడ నుంచి తలకు వ్యాపించే నొప్పి అంటే ఏమిటి?
తలనొప్పి తగ్గేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Forehead Pain |ఆంధ్రప్ర, వెబ్ డెస్క్ : తలనొప్పి.. మనలో ఈ సమస్యను ఫేస్ చేయని వాళ్ళు ఎవరూ ఉండరు కదా. అయితే చాలామంది తలనొప్పి అనగానే ఏదో ఒక టాబ్లెట్ మింగేస్తూ ఉంటారు. కానీ, మీకు తెలుసా? మీకు వచ్చే తలనొప్పి మామూలుదా? మైగ్రేనా? లేదా సైనస్ వల్ల వస్తుందా? అనేది మీ తలలో ఏ భాగంలో నొప్పి వస్తుందో దాన్ని బట్టే ఈజీగా చెప్పేయొచ్చు. మరి మీ తలనొప్పికి వెనుక ఉన్న అసలు కారణం ఏంటో, దాన్ని ఎలా గుర్తించాలో ఈరోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం…

- నుదుటి నొప్పి (Forehead Pain)
నుదుటి భాగంలో ఎక్కువగా ఒత్తిడిగా లేదా భారంగా అనిపించడం. నిత్యజీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి వల్ల లేదా సైనస్ ప్రాంతంలో ఒత్తిడి పెరగడం వల్ల ఈ రకమైన నొప్పి వస్తుంది. - కణతల నొప్పి (Temples Pain)
తలకి ఇరువైపులా (కణతల భాగంలో) సురకలు వేసినట్లు నొప్పి రావడం. తీవ్రమైన టెన్షన్, శరీరంలో డిహైడ్రేషన్ (నీటి శాతం తగ్గడం) లేదా కొందరు నిద్రలో తెలియకుండానే పళ్ళు కొరకడం వల్ల ఈ నొప్పి తలెత్తుతుంది. - కళ్ల వెనుక నొప్పి (Behind the Eyes)
కంటి గుడ్ల వెనుక భాగంలో విపరీతమైన లాగినట్లు లేదా ఒత్తిడిగా అనిపించడం. స్క్రీన్ టైమ్ ఎక్కువై కళ్లు అలసిపోవడం , గ్లాకోమా వంటి కంటి సమస్యలు లేదా సైనస్ గ్రంధులు మూసుకుపోవడం దీనికి ప్రధాన కారణాలు. - సైనస్ ప్రాంతం – ముక్కు, బుగ్గలు (Sinus Area)
ముక్కు చుట్టుపక్కల, బుగ్గల భాగంలో తాకితే నొప్పిగా, భారంగా ఉండటం. సైనస్ ఇన్ఫెక్షన్లు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే అలర్జీలు లేదా తీవ్రమైన జలుబు చేయడం వల్ల ఈ భాగంలో నొప్పి వస్తుంది. - ఒక వైపు మాత్రమే నొప్పి (One-Sided Pain / Migraine)
తలలో కేవలం ఒక వైపు మాత్రమే (ఎడమ లేదా కుడి) తీవ్రమైన పొడిచినట్లు లేదా కొట్టుకుంటున్నట్లు నొప్పి రావడం. ఇది ప్రధానంగా మైగ్రేన్ లేదా క్లస్టర్ తలనొప్పి ముఖ్య లక్షణం. - తల పైభాగం (Top of the Head)
తల నడినెత్తి భాగంలో బరువు పెట్టినట్లు లేదా లాగుతున్నట్లు అనిపించడం. కండరాల తీవ్ర ఒత్తిడి, శరీరంలో నీటి శాతం లోపించడం లేదా కూర్చునే, నిల్చునే సమయంలో సరైన శారీరక భంగిమ పాటించకపోవడం వల్ల ఈ నొప్పి వస్తుంది. - దవడ నొప్పి (Jaw Pain)
దవడల భాగం నుంచి తలలోకి నొప్పి పాకడం. టెంపరోమాండిబ్యులర్ జాయింట్ రుగ్మత, నిద్రలో పళ్ళు కొరకడం లేదా తీవ్రమైన సైనస్ ఇన్ఫెక్షన్ ప్రభావం దవడలపై పడటం. - తల వెనుక భాగం – ఆక్సిపిటల్ (Back of the Head)
తల వెనుక వైపు కింది భాగంలో నొప్పి పుట్టడం. ఆర్థరైటిస్ సమస్యలు, కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోవడం లేదా ఆ ప్రాంతంలోని నరాల మీద ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది. - మెడ, తల కింది భాగం (Neck and Lower Head)
మెడ నరాల నుండి తల కింది భాగం వరకు నొప్పి వ్యాపించడం. దీనిని సెర్వికోజెనిక్ తలనొప్పి అంటారు. మెడ కండరాల ఒత్తిడి, మెడ ఎముకల ఆర్థరైటిస్ వంటి సమస్యలు దీనికి కారణం.

ఇలాంటి తల నొప్పి వస్తే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు..
-రోజూ తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
-కంప్యూటర్, మొబైల్ చూసేటప్పుడు సరైన సిట్టింగ్ పోశ్చర్ మెయింటైన్ చేయాలి.
-నిరంతరంగా ఒకే రకమైన తలనొప్పి వేధిస్తుంటే సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే వైద్యులను సంప్రదించి సరైన కారణాన్ని తెలుసుకోవడం ఉత్తమం.

