కన్కల్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
తాడ్వాయి, ఆంధ్రప్రభ : కన్కల్ గ్రామంలో ఆరుగురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు భూపతి రెడ్డి పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందజేసినట్లు ఆయన తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే మదన్మోహన్రావుతో పాటు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్రెడ్డి, ఉపసర్పంచ్ చాకలి మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
