రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర
చిట్యాల, ఆంధ్రప్రభ: రైతుల సంక్షేమం కోసం ప్రజా పాలన ప్రభుత్వం కట్టుబడి ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (GSR) అన్నారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.
మద్దతు ధరకు అమ్ముకోవాలి…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన వరి పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. గ్రామాల్లో దళారుల మాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. మండలంలో ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాల్లోనూ ఇన్చార్జీలు సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని ఆయన ఆదేశించారు.
కొనుగోలు ప్రక్రియ వేగవంతం..
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి, తాసిల్దార్ సంపత్ రావు, ఎంపీడీవో జయశ్రీ, స్థానిక సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మరియు మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
