Sunday Vibes – ప్ర‌కృతి ఆహ్లాదానికి ప‌క్షులు చిహ్నం

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ :కిలకిలలాడే పక్షులు ప్రకృతి స్వర్గానికి చిహ్నమ‌ని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ, గ్రీనిండియా చాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కుడు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఎక్స్ వేదిక‌గా ప‌క్షుల ఫొటోల‌ను షేర్ చేశారు. సండే వైబ్స్ అంటూ పెట్టిన ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

కాగా, ప్ర‌కృతిని కాపాడ‌టం, ప‌క్షుల సంర‌క్ష‌ణ‌, కిల‌కిల‌లాడే ప‌క్షుల‌ను ఆస్వాదించ‌డంపై సంతోష్‌కుమార్ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తుంటారు. ఈ ఆదివారం ప‌క్షుల ఫొటోల‌ను పోస్టు చేశారు. ప‌క్షి స్వ‌రాలు.. మాన‌సిక ఉల్లాసాన్నిస్తాయిపక్షులు లేని ప్రకృతి అంటే జీవితం లేని ప్రకృతి అని నిపుణులు చెబుతుంటార‌ని జోగిన‌ప‌ల్లి సంతోష్‌ పేర్కొన్నారు. పక్షుల మనుగడ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో అంతర్భాగమ‌న్నారు.

ఇది అందరికీ ప్రేరణనిస్తుంద‌ని తెలిపారు. పక్షుల కిలకిలా రావాలు వినడం ఎవరికైనా ఆనందాన్ని కలిగిస్తుంద‌న‌డంలో సందేహం లేద‌ని, పక్షులు చేసే శబ్దాలు వినడంతో మనసు కుదుట పడుతుందని పేర్కొన్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా అందమై ప్రకృతిని ఆస్వాదించాలని, భిన్నమైన పక్షుల స్వరాలను వింటే మాన‌సిక ఉల్లాసం పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నార‌ని త‌న పోస్టులో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *