Awareness | ఇన్ఫర్మేషన్ యాక్ట్‌తో సాధికారత కల్పన
డీఆర్ఓ కే.మోహన్ రావు
Awareness | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: దేశ పౌరులకు సాధికారత కల్పించడమే ఇన్ఫర్మేషన్ యాక్ట్- 2005 ముఖ్య ఉద్దేశమని డీఆర్ఓ కే.మోహన్ రావు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని ప్రత్యేక సమావేశ మందిరంలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ -2005 అనే అంశంపై జిల్లా అధికారులతో అవేర్నెస్ ప్రోగ్రాం (Awareness Program) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డీఆర్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజలకు వివిధ ప్రభుత్వ సంస్థల యంత్రాంగాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు సమాచార హక్కు చట్టం కల్పించడం జరిగిందని తెలిపారు. సమాచార హక్కుకు సంబంధించిన నియమ నిబంధనలు విధివిధానాలను ఈ చట్టం నిర్దేశిస్తుంది. ఈ చట్టంలో ఆరు భాగాలు 31 సెక్షన్లు ఉన్నాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సహాయ ప్రజా సమాచార అధికారి (ఏపీఐఓ) ప్రజా సమాచార అధికారి (పీఐఓ), అపిలేట్ అధికారి పేర్లను ప్రతీ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే సమాచార హక్కు చట్టానికి సంబంధించి రిజిస్టర్లను నిర్వహించాలని తెలిపారు. గతంలో లేకపోయినా ఇప్పటినుండి అయినా కార్యాలయంలో బోర్డులను, రిజిస్టర్లను పక్కాగా నిర్వహించేలా చూడాలని ఆదేశించారు.

అనంతరం రిటైర్డ్ తహసీల్దార్ రఘుపతి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 కింద ఎవరైనా ఏదైనా అడగవచ్చునని, దానికి సంబంధించి ఐదు రోజులలో వివరణ ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ నియంత్రణలోని కార్యాలయాలు సెక్షన్ టు పరిధిలోకి వస్తాయని తెలిపారు. సమాచారం హక్కు చట్టం అనగా రికార్డులు పత్రాలు (Records are documents) అభిప్రాయాలు సలహాలు ఉత్తర్వులు డేటా అమలులో ఉన్న మరి చట్టం ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం సంపాదించదగిన ఏ ప్రైవేటు సంస్థకు సంబంధించిన సమాచారమైన సెక్షన్ (2) ఎఫ్ కింద వస్తుందని తెలిపారు. పౌర సమాచార అధికారి నుండి నిర్ణీత సమయంలో సమాచారం అందని మరియు పౌర సమాచార అధికారి తీసుకున్న నిర్ణయంతో అసంతృప్తి చెందినవారు ఈ కాల పరిమితి ముగింపు తర్వాత లేక నిర్ణయం అందిన 30 రోజులలో సదరు పౌర సమాచార అధికారికి యంత్రములో సీనియర్ హోదాలో ఉన్న అధికారికి మొదటి ఆపిల్ను సెక్షన్ 19 (1) కింద అప్పీల్ ను సమర్పించుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎమ్మార్వోలు, సమాచార హక్కు చట్టం 2005 చూస్తున్న అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

