15 Numbers | జార్ఖండ్లో కాల్పుల మోత

15 Numbers | జార్ఖండ్లో కాల్పుల మోత
- దద్దరిల్లుతున్న సరండ అటవీ ప్రాంతం
- 15మంది మావోయిస్టులు మృతి
15 Numbers | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని సరండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతాబలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
దట్టమైన అటవీ ప్రాంతం, కొండలు ఉండటంతో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 15 మంది మావోయిస్టులు మరణించినట్లుగా తెలుస్తోంది. ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఎన్కౌంటర్లో కీలక నేతలు మరణించి నట్టు ప్రచారం జరుగుతోంది.
