బదిలీపై వెళ్తున్న కార్యదర్శికి సన్మానం

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామానికి గత ఏడు సంవత్సరాలుగా గ్రామానికి పంచాయతీ కార్యదర్శిగా సేవలు అందించిన దీపిక వేరే గ్రామపంచాయతీకి బదిలీ కావడం జరిగింది. వారి సేవలను, గ్రామాభివృద్ధికి చేసినటువంటి కృషికి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దీపిక మాట్లాడుతూ.. మేకలగట్టు గ్రామ ప్రజలు తనపై చూపించిన ప్రేమను, ఆప్యాయతను ఎప్పుడూ మర్చిపోలేనని అన్నారు.

ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇల్లందుల రవి, ఉపసర్పంచ్ పండుగహరిష్, గ్రామ మాజీ సర్పంచ్ సంధ్యారాణి కిరణ్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ కొలిపాక సుధాకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉడుత వేణుగోపాల్ యాదవ్, మాజీ ఎంపిటిసి స్వర్ణలత పరుశరాములు, గ్రామ పెద్దలు ఉడుత సురేష్, వార్డు సభ్యులు బొమ్మన భరత్ గౌడ్, గ్రామ ఆరోగ్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply