మెడికల్ కాలేజీల‌ను ప్రైవేటీక‌రించొద్దు..

గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీ ఆధ్వర్యంలో ర్యాలీ

గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమాన్ని బుధవారం నిర్వహించారు. నియోజవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు వంశీతో కలిసి ర్యాలీగా త‌హ‌సీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణ‌యాన్ని వెనుక‌కు తీసుకొని ప్రభుత్వమే మెడికల్ కాలేజీల‌ను నిర్వహించాలని కోరుతూ త‌హ‌సీల్దార్ శివయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపులపాడు, ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండలం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు నక్క గాంధీ, గన్నవరం, ఉంగుటూరు ఎంపీపీలు అనగాని రవి, వడ్లమూడి సరోజిని, ఉంగుటూరు మండల అధ్యక్షుడు వింత శంకర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply