Land Resurvey | ఒకరు మృతి

Land Resurvey | ఒకరు మృతి

Land Resurvey | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం భూమయ్యగారిపల్లిలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూ రీ సర్వే సందర్భంగా ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

గ్రామస్తుల వివరాల ప్రకారం, ఘర్షణలో గాయపడిన రామకృష్ణ, రామచంద్రలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా రామకృష్ణ మృతి చెందాడు. మరో వ్యక్తి రామచంద్ర ప్రస్తుతం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

భూ రీ సర్వే ప్రక్రియ జరుగుతున్న సమయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అది కాస్తా ఘర్షణగా మారినట్లు సమాచారం. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి ఘటనకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply