పర్యావరణ పరిరక్షణలో అందరం భాగమౌదాం

పర్యావరణ పరిరక్షణలో అందరం భాగమౌదాం

కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ బృందం మంగళవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాంకేతికతను జోడించి పాలనను సామాన్యులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

లయన్స్ క్లబ్ మెంటార్ నటుకుల మోహన్, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవి కుమార్ మాట్లాడుతూ.. దేశ సేవలో నిరంతరం శ్రమిస్తున్న అధికారుల కృషిని అభినందించడం ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ వారాంతంలో చేపట్టబోయే కార్యక్రమాలకు కలెక్టర్, జేసీ తమ మద్దతు ప్రకటించారు.

అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు నేసిన గుడ్డ సంచులను వారు పరిశీలించి, శ్రీకాకుళంలో కూడా వాటి తయారీకి ఉన్న అవకాశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ, జెసిఐ మెయిన్ జాయింట్ సెక్రటరీ సిరిబారికి బాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply