అభాగ్యుల‌కు దుప్ప‌ట్ల పంపిణీ…

అభాగ్యుల‌కు దుప్ప‌ట్ల పంపిణీ…

కరీమాబాద్, ఆంధ్రప్రభ : సనాతన హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో పలు చోట్ల రోడ్లపై పడుకున్నఅనాధలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సనాతన హిందూ సేవాసమితి(Sanatana Hindu Seva Samiti)కి ఇది 128 వ సేవా కార్యక్రమం అని తెలిపారు.

ఏ ఆధారం లేక రోడ్ల పై, ఫుట్ పాత్‌ల పై బస్టాండ్‌లో, స్టేషన్ ఆవరణలో నిద్రించే అభాగ్యులకు చలి కాలం సందర్బంగా దుప్పట్లు పంచడం జరిగిందని నిర్వాహకులు వెల్లడించారు. వరంగల్ నగరంలో సోమవారం అర్ధరాత్రి 11 గంటల నుండి అర్ధరాత్రి 1 గంట వరకు వరంగల్ రైల్వే స్టేషన్, బస్టాండ్,, అండర్ బ్రిడ్జ్, సీకేఎం హాస్పిటల్, జె పిఎన్ రోడ్, ఎస్విఎన్ రోడ్, మండి బజార్, దేశాయిపేట, ఎంజీఎం హాస్పిటల్, భద్రకాళి గుడి, ములుగు రోడ్, కాశి బుగ్గ, లేబర్ కాలనీ, నర్సంపేట రోడ్,, ఖమ్మం రోడ్, శివ నగర్ ఏరియాలో నీ 50 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందనీ గ్రూప్ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్(Tallapalli Nagesh) తెలిపారు.

కార్యక్రమంలో సలహా దారు అంచూరి వేణు గోపాల్(Anchuri Venu Gopal), ప్రతాపగిరి గణేష్,, గ్రూప్ సభ్యులు బడుగు రాము, గంగిడి ధర్మారెడ్డి, బైరిశెట్టి కార్తీక్, పెరుమాండ్ల శ్రవణ్,చందా రమేష్,,మేరుగు కరుణాకర్, దిడ్డి మోహన్,దమరకొండ పూర్ణ, మందాటి భారత్ పాల్గొన్నారు.

Leave a Reply