మత్స్యకారుల సేవలో’.. గంగపుత్రులకు రెండో ఏడాది అండగా…

మత్స్యకారుల సేవలో’.. గంగపుత్రులకు రెండో ఏడాది అండగా…

  • ఎమ్మెల్యే ఈశ్వరరావు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టరెట్ లో నిర్వహించిన మత్స్యకారుల సేవలో’ కార్యక్రమం లో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తో కలిసి లబ్ధిదారుల చెక్కు ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం లోని ప్రజాప్రభుత్వం రెండో ఏడాది కూడా గంగపుత్రులకు అండగా నిలబడుతూ నెల్లూరు జిల్లా కావలిలో నిధులు విడుదల కార్యక్రమం చేపట్టిందని, ప్రతీ కుటుంబానికి 20 వేల రూపాయిల చొప్పున జమచేస్తారని, శ్రీకాకుళం జిల్లా కు 16,737 కుటుంబాలకు 33 కోట్ల 50 లక్షల లబ్ది జరుగుతుందని తెలిపారు..

అంతేకాకుండా మత్స్యకారుల కోసం మూలపేట పోర్ట్, బుడగట్లపాలెం పిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని,సహకారం అందిస్తున్న మత్స్య, పశు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply