అభినందనలు తెలిపిన మంత్రి పొన్నం
ప్రజలకు రవాణా పరమైన సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలి
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : నూతనంగా నియమితులైన నాన్ అఫీషియల్ (ఆర్‌టీఏ) సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. కొత్తగా నియమైకమైన వారితో సమాచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 24 మందికి ఆర్టీఏ సభ్యులుగా అధికారిక నియామక పత్రాలు వచ్చాయని, మిగిలిన వారికి కూడా త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. జిల్లాల్లో స్థానిక నాయకత్వం సలహా సూచనల మేరకు నేరుగా మీ వద్దకే నియామక పత్రాలు వచ్చాయని మంత్రి పొన్నం తెలిపారు. కొత్తగా నియామకైమైన సభ్యులు రవాణా శాఖ గౌరవాన్ని అభివృద్ధిని ప్రజల సౌకర్యార్థం రవాణా సేవల్లో వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రవాణాశాఖ కార్యకలాపాలపై అవగాహన..
ప్రస్తుతం రవాణా శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాలు తదితర అంశాలను స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ వివరించారు. రవాణా శాఖ విధులు మోటారు వాహనాల చట్టం రిజిస్టరేషన్ ,పన్ను వసూలు , లైసెన్స్ ,ఫిట్నెస్ , తనిఖీలు ,రోడ్ సేఫ్టీ ,పొల్యూషన్ కంట్రోల్ , మీ సేవా యాప్ (టి యాప్ ) ,ఆర్టీఏ ఎం వాలెట్ , నవంబర్ 16 నుండి అమలు చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ ,వెహికిల్ స్క్రాప్ పాలసీ ,TS నుండి TG గా మార్పు ,ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ , వాహనాల ట్రాకింగ్ పరికరాలు , ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్ , తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి రవాణా శాఖకు లోగో ఏర్పాటు ,రోడ్డు భద్రత రవాణా శాఖ మొదటి ప్రాధానత్య తదితర అంశాలను RTA నాన్ అఫిసియో సభ్యులకు వివరించారు. సమావేశంలో జెటీసీలు శివ లింగయ్య , చంద్రశేఖర్ గౌడ్, ఆర్టీఏ మెంబెర్స్ పాల్గొన్నారు.