Beautiful Star | మిస్ వరల్డ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ వరకు..

Beautiful Star | మిస్ వరల్డ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ వరకు..
Beautiful Star | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అందాల తార, మానుషి చిల్లర్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏదో ఒక విలాసవంతమైన ద్వీపంలో ప్రశాంతమైన రాత్రి వేళను ఆస్వాదిస్తున్న ఫోటోను ఆమె షేర్ చేసింది. మెత్తని రంగులు, డిజైన్లతో ఉన్న స్టైలిష్ టూ-పీస్ డ్రెస్ ధరించిన మానుషి, ఆ ఫోటోకు ‘ఐలాండ్ గాల్’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఆమె తన పోస్ట్‌లో పతినా మాల్దీవులు మరియు పిక్ యువర్ ట్రయల్ గురించి ప్రస్తావించడాన్ని బట్టి, ప్రస్తుతం ఆమె మాల్దీవుల్లో సెలవులను గడుపుతోందని అర్థమవుతోంది.
మానుషి చిల్లర్ జీవితం 2017లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లోకి ప్రవేశించడంతో పూర్తిగా మారిపోయింది. మొదట ఫెమినా మిస్ ఇండియా హర్యానా టైటిల్ గెలుచుకున్న ఆమె, ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2017 కిరీటాన్ని కైవసం చేసుకుంది. అదే ఏడాది ప్రపంచ సుందరి పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి విజేతగా నిలిచింది. సుమారు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో భారతీయ మహిళగా మానుషి రికార్డు సృష్టించింది.
ప్రపంచ సుందరిగా ఉన్న సమయంలో ఆమె ‘ప్రాజెక్ట్ శక్తి’ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో చుర




