రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో తండావాసి

రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో తండావాసి

వెల్దండ , ఆంధ్రప్రభ: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర తండా కు చెందిన విస్లావత్ లవిక్ రామ్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో ప్రతిభ కనబరిచారు. కొట్ర తండాకు చెందిన విస్లావత్ స్వప్న,సురేష్ దంపతుల కుమారుడైన లవిక్ రామ్ రెండో తరగతి చదువుతు చెస్ కోచ్ సహజశ్రీ సహకారంతో చెస్ పోటీలకు శిక్షణ పొందారు.
ఈ సందర్బంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్ 7 బాల బాలికల చెస్ పోటీలు నిర్వహించగా లవిక్ రామ్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. దీంతో విద్యార్థి లవిక్ రామ్ కు నిర్వాహకులు ప్రశంస పత్రం, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా లవిక్ రామ్ తల్లిదండ్రులు గ్రామస్తులు హర్ష వ్యక్తం చేసి విద్యార్థినిని అభినందించారు.

Leave a Reply