- పేదలకు విద్యను దూరం చేసే ప్రయత్నం
- కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని విద్యార్థులకు పీజ్ రీయింబర్స్‌మెంట్, అందేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు నిధులు విడుదల చేయకుండా.. పేదలకు విదేశీ విద్యను దూరం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎంపికై వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన విద్యార్థులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. దాదాపు 200 మంది విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తుందన్నారు. పేద విద్యార్థులు విదేశాల్లో చదవాలనేది కేసీఆర్ ఆలోచన అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం ఉద్దేశాన్ని తుంగలో తొక్కిందని ఆరోపించారు.
పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం ఎందుకు చిన్నచూపు చూస్తోందని నిలదీశారు. స్కాలర్ షిప్ అందక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, దానికోసం వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. రెండో విడత నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.