Congress | బీజేపీది పెద్ద కుట్ర : ప్రియాంక గాంధీ

Congress | బీజేపీది పెద్ద కుట్ర : ప్రియాంక గాంధీ
Congress | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో కుతంత్రం రచించిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఇవాళ ఆమె ఢిల్లీలో మాట్లాడుతూ… డీలిమిటేషన్ ద్వారా శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ ఎత్తుగడ వేసిందని ఆరోపించారు. అందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకోవాలని బీజేపీ కుట్ర చేసిందన్నారు. అప్రజాస్వామ్య బిల్లును అడ్డుకున్నందుకు తాము మహిళా వ్యతిరేకులమని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. తాము మహిళలకు ఎందుకు వ్యతిరేకంగా వెళ్తాం… విపక్షాలు ఏకమై సవరణ బిల్లును ఓడించడం సంతోషదాయకమైన విషయమన్నారు.
