Charging Bicycle | రైతు వినూత్న ఆలోచన..

Charging Bicycle | రైతు వినూత్న ఆలోచన..

  • చార్జింగ్ సైకిల్ తో ఎంతో మేలు!
  • రైతు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కనకరాజు..

Charging Bicycle | నిజాంపేట, ఆంధ్రప్రభ : ఉరుకుల పరుగుల జీవితాల్లో మనిషికి ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో మానవుడు జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతులుగా ఉండాలంటే రోజూ వ్యాయామం, వాకింగ్, సైకిల్ తొక్కితే ఆరోగ్యవంతులుగా ఉంటారని వైద్యులు సూచించడంతో రజాక్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కనకరాజు వినూత్న ఆలోచనతో రూ.25వేలతో చార్జింగ్ సైకిల్ ను కొనుగోలు చేశాడు.

Charging Bicycle

ఈ సైకిల్ ఒక్క‌సారి ఛార్జింగ్ చేసినట్లయితే 45 కిలోమీటర్లు మేర ప్రయాణం చేయవచ్చని తెలిపారు. చార్జింగ్ స్కూటీలు కొనుగోలు చేసినట్లయితే ఎప్పుడు పాడవుతుందో తెలియదని, ఈ చార్జింగ్ సైకిల్ కొనుగోలు చేసినట్లయితే రెండు విధాలుగా వాడుకోవచ్చని, దీని ద్వారా మనిషి ఆరోగ్యంతో పాటు జీవనశైలి మార్చుకోవచ్చని తెలిపారు. వ్యవసాయం ఉన్న రైతుకు ఇలాంటి సైకిల్ ఎంతో ఉపయోగపడుతుంద‌న్నారు.

Leave a Reply