హెరిటేజ్ కోసమే విజయ డైరీపై కన్ను..?
ఇద్దరు మంత్రులు బెదిరించి చైర్మన్‌తో రాజీనామా చేయించారు-
పేర్ని నాని సంచలన ఆరోపణలు
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో శనివారం విజయ డైరీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. విజయ డైరీ చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు చట్టబద్ధంగా ఎన్నికైన గంటలోపే ఇద్దరు మంత్రులు వెళ్లి బెదిరించి రాజీనామా చేయించారని మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు.
హెరిటేజ్ కోసమే విజయ డైరీని కబళించే ప్రయత్నం జరుగుతోందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధన దాహం కోసం ఎవరినీ లెక్కచేయడం లేదని… గతంలో వైసీపీ నేతలపై కేసులు పెట్టేందుకు “రెడ్ బుక్” పేరును ఉపయోగించారని, ఇప్పుడు కూటమి నేతలే సంస్థలను మింగేసే పరిస్థితి వచ్చిందని పేర్ని నాని మండిపడ్డారు.
విజయ డైరీ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రగడకు కేంద్రంగా మారింది. చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు చట్టబద్ధంగా గెలిచారు…కానీ ఎన్నికైన గంటలోపే ఇద్దరు మంత్రులు వెళ్లి ఆయనపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారని పేర్ని నాని ఆరోపించారు. ఇది విజయ డైరీని హెరిటేజ్‌కు అప్పగించే కుట్రేనా అంటూ ప్రభుత్వ తీరుపై ప్రశ్నలు సంధించారు.
రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతలను టార్గెట్ చేశారని ఆరోపించిన పేర్ని నాని… ఇప్పుడు కూటమి నేతలే ధన దాహంతో సంస్థలను మింగేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. విజయ డైరీ వ్యవహారంలో ఎవరైనా తప్పు చేస్తే…వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊసలు లెక్కపెట్టడం ఖాయం అంటూ పేర్ని నాని హెచ్చరించారు.
