స్నేహితుని కుటుంబానికి చేయూత
రూ.67 వేలు నగదు సహాయం
మోత్కూర్, ఆంద్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంగడి బజార్ కు చెందిన ఆరె జహంగీర్ ఇటీవల మృతి చెందగా, శనివారం ఆ కుటుంబాన్ని అంగడి బజార్ స్నేహితులు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి మనోధైర్యం కల్పించి స్నేహితులంతా కలిసి సేకరించిన రూ.67 వేల ఆర్ధిక సాయాన్ని కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు బోయిని యాకు, ఎడ్ల తిరుమలేష్, పురుగుల శ్రీను, అవిశెట్టి యాదగిరి, బుర్ర ఉపేందర్, అవిశెట్టి కిరణ్ కుమార్, పురుగుల మల్లేష్, ఎడ్ల శేఖర్, అవిశెట్టి మధు, ఎలిమినేటి సాయికుమార్, అవిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
