ఘనంగా బుద్ధా వెంకన్న జన్మదిన వేడుకలు..
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బుద్ధా వెంకన్న జన్మదిన వేడుకలను అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు విక్కుర్తి రాంబాబు ఆధ్వర్యంలో, అవనిగడ్డ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా యాసం చిట్టిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి బుద్ధా వెంకన్న చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు. బుద్ధా వెంకన్నకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, తెదేపా రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి పుల్లగోరు రాజేంద్ర, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, మండల మహిళా అధ్యక్షురాలు యాసం లంకమ్మ, సీనియర్ నాయకులు మెగవత్తు గోపి, సిద్దాబత్తుని హరిబాబు, లుక్క పిచ్చియ్య, కనగాల సత్యంబాబు, పార్టీ నాయకులు అడపా వెంకటేశ్వరరావు, బర్మా శ్రీను, నాగినేని నాగేశ్వరరావు, మొఘల్ మురాద్, షేక్ బషీర్, షేక్ ఖలీల్, కమ్మిలి సుబ్రమణ్యం, మెకానిక్ బాలకృష్ణ, తుంగల రామాంజనేయులు, మెకానిక్ రవి, ఆది శివాజీ, పిరాటి రాంబాబు, అవనిగడ్డ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
