రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించండి..

చందూర్, ఆంధ్రప్రభ : చందూరు మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ నుండి పంచాయతీ కార్యాలయం వరకు డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని చందూర్ లోని విఘ్నేశ్వర కాలనీవాసులు, గ్రామస్తులు సర్పంచ్ మద్దూరు మాధవరెడ్డికి శనివారం వినతిపత్రాన్ని అందజేశారు.ఇటీవల రోడ్డు నిర్మించారని కానీ డ్రైనేజీ పనులు మాత్రం చేపట్టలేదని రానున్న రోజుల్లో వర్షాకాలం ఉన్నందున రోడ్డుపై నీళ్ళు ఇళ్లల్లోకి చేరుతాయని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, విగ్నేశ్వర కాలనీ వాసులు పాల్గొన్నారు.
